VIDEO: గుడుంబా స్థావరాలపై దాడి..1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
MNCL: కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీతండా(డీ) గ్రామ శివారులో ఆదివారం గుడుంబా స్థావరాలపై SI గంగారాం, సిబ్బందితో కలిసి దాడులు చేశారు. గ్రామ శివారులో గుడుంబా తయారు చేస్తున్నారని తెలుసుకొని ఆకస్మికంగా దాడులు చేశామన్నారు. ఈ తనిఖీల్లో 1000 లీటర్ల బెల్లం పానకంను గుర్తించి పానకంతో పాటు సామాగ్రిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.