భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతం: ఎమ్మెల్యే

భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతం: ఎమ్మెల్యే

కర్నూలు: సత్యసాయి బాబా నిర్మించిన సేవా ప్రాజెక్టులు, వైద్య కళాశాలలు, విద్యాసంస్థలు శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ఓర్వకల్లు మండలం బాలభారతి ఉన్నత పాఠశాలలో జరిగిన సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. శత జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఆనందకరమని పేర్కొన్నారు.