బీసీ హాస్టల్‌ను సందర్శించిన కమిషనర్

బీసీ హాస్టల్‌ను సందర్శించిన కమిషనర్

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను నిన్న సాయంత్రం మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని హాస్టల్ వార్డెన్‌ను ఆదేశించారు. అనంతరం హాస్టల్ నిర్వహణపై వార్డెన్‌కు కమిషనర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.