IKP కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
JN: తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లి, సోలిపురం, అంకుషాపురం, నర్మెట మండలంలోని మచ్చు పహాడ్, వెల్డండా గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను జనగామ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయాలని తెలిపారు. రైతులకు మద్దతు ధరలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.