పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన MEO

GNTR: పొన్నూరులోని శెట్టి కోటయ్య మెమోరియల్ మున్సిపల్ పాఠశాలను బుధవారం మండల విద్యాశాఖాధికారి-2 విజయభాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం రుచిచూసి నిర్వాహకులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.