నులిపురుగుల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

నులిపురుగుల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

SRPT: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ లింగమూర్తి అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న వారికి అల్బెండజోల్‌ మాత్రలు అందజేయాలన్నారు.