'ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలి'

'ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలి'

పెద్దపల్లి జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు 100% ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో, జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను 100% మార్కింగ్ చేయాలని, మార్కింగ్ పూర్తయిన లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు.