మంత్రి రవీంద్రకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

CTR: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం చిత్తూరు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసంలో పలు అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.