'లోక్ అదాలత్‌లో 145 కేసులు పరిష్కారం'

E.G: అడ్డతీగల, రంపచోడవరం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 145 కేసులు పరిష్కరించినట్లు న్యాయమూర్తి పి. బాబు తెలిపారు. వీటిలో 105 సారా కేసులు ఉండగా... 39 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. మరొకటి మెయింటనెన్స్ కేసు పరిష్కరించామన్నారు. ఆయా కేసులు కాంపౌండింగ్ ఫీజుగా రూ 4.93 లక్షలు చెల్లించారన్నారు.