VIDEO: ఆర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
NLR: ఇందుకూరు మండలం కొత్తూరు గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు.