VIDEO: జీడి రైతుల వినూత్న నిరసన
AKP: దేవరాపల్లిలో జీడి రైతులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఉరి తాళ్లపై వేలాడుతూ అన్నదాతల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా భారీగా నష్టపోయిన జీడి రైతులు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని రైతులు ఆవేదనను వెళ్ళబోశారు.