'తురకపాలెం మృతులకు న్యాయం చేయాలి'

GNTR: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఇటీవల తురకపాలెం గ్రామంలో జరిగిన వరుస మరణాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని ఆరోపిస్తూ, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.