వేసవి సమస్యలపై సమీక్ష
KMM: ఏదులాపురం మున్సిపల్ పాలక వర్గ సాధారణ సమావేశం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైంది. వేసవిలో తాగు నీరు, చేతి పంపుల మరమ్మతులు, కార్మికుల వేతనాలు, పారిశుద్ధ్య పనులపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో పాటు కమిషనర్ మున్వర్ అలీ, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, వార్డు కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.