అల్లూరి జిల్లా ఏజెన్సీలో పెరుగుతున్న చలి ప్రభావం

అల్లూరి జిల్లా ఏజెన్సీలో పెరుగుతున్న చలి ప్రభావం

ASR: అల్లూరి జిల్లాలో శీతల గాలులు విరుచుకుపడుతున్న నేపథ్యంలో చలి తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. బుధవారం పాడేరులో కనిష్ఠంగా 13°C, మినుములూరులో 11°C నమోదయ్యాయి. అనంతగిరి 14.6°C, అరకువ్యాలీ 12°C, చింతపల్లి 17.2°C, జి.మాడుగుల 13.4°C వద్ద ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఏజెన్సీ ప్రాంతమంతా ఉదయం సమయంలో దట్టమైన మంచు కమ్ముకుని చలికాలం ప్రభావాన్ని మరింత పెంచింది.