VIDEO: నంబాలకు రాకపోకలు బంద్

ASF: రెబ్బెన మండలం నంబాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నంబాల బ్రిడ్జి నుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఎక్కడికక్కడే నిలిచిపోయారని అన్నారు. స్థానిక అధికారులు మాట్లాడుతూ.. బ్రిడ్జి పై నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండడంతో ఎవరు కూడా బ్రిడ్జిపై నుంచి రావద్దని సూచించారు.