‘బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగింది'

‘బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగింది'

కృష్ణా: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు కృష్ణా జిల్లా యువ మోర్చ ప్రధాన కార్యదర్శి యిర్రింకి నాగ శ్రీవివాస నాయుడు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ప్రజలకు రోజు రోజుకి నమ్మకం పెరుగుతుందన్నారు. విజయవాడ రూరల్ బీజేపీ అధ్యక్షుడు బత్తుల చిన్నారావు పాల్గొన్నారు.