హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం వాయిదా

HYD: హైదరాబాదులోని హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు వివరాలు ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించాల్సి ఉండగా తాజాగా రీ షెడ్యూల్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన విడుదల చేశారు.