మాజీ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాకుల మానుతాండాలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ కుటుంబానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు.