తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
కృష్ణా: చల్లపల్లిలో శిధిలావస్థకు చేరి ప్రస్తుత వర్షాలకు పెచ్చులూడి పడుతున్న తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఆదివారం చల్లపల్లి వచ్చిన కలెక్టర్ తహశీల్దార్ కార్యాలయ పరిస్థితి పరిశీలించారు. ప్రధాన సెంటర్లో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న గ్రామ సచివాలయం-1 భవనంలో కార్యాలయాన్ని మార్చుకోవాలని ఆదేశించారు.