వినతులు తగ్గేలా చర్యలు తీసుకోవాలి: జే.సీ

వినతులు తగ్గేలా చర్యలు తీసుకోవాలి: జే.సీ

PPM: రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన వినతులను తక్షణమే పరిష్కరించాలని పార్వతిపురం మన్యం జిల్లా ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తహసీల్దార్లను ఆదేశించారు. మండలం స్థాయిలో గ్రీవెన్స్ తగ్గేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ అంశాలు, వివిధ వినతుల పురోగతిపై తహసీల్దార్లతో ఆయన ఛాంబర్‌లో సమీక్షించారు.