కరెంట్ షాక్ తో వివాహిత మృతి

కరెంట్ షాక్ తో వివాహిత మృతి

KMM: ఖమ్మం నగరంలో కరెంట్ షాక్‌తో ఓ వివాహిత మృతి చెందింది. శ్రీనివాసనగర్‌కు చెందిన సాయిప్రియ (25) సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇటీవల అనారోగ్యంతో పుట్టింటికి వచ్చింది. శుక్రవారం బట్టలు ఆరేస్తుండగా విద్యుత్     షాక్‌తో అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.