ఆ సార్ బడికి రారు? ఎక్కడంటే!
ADB: జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బేల మండలం మారుమూల గిరిజన గ్రామం ఖడ్కి పాఠశాలలో ఓ టీచర్ విధులకు హాజరవడం లేదు. ఆయన సర్కారు పాఠశాల ఉపాధ్యాయుడు. కానీ పిల్లలకు చదువు చెప్పేంత తీరిక లేక ప్రైవేటుగా ఓ వాలంటీర్ ను పెట్టుకున్నాడు. వాలంటీర్ తోనే పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. పిల్లల భవితతో ఆటలాడుతున్న అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.