చెరువులో విద్యుత్ అధికారుల సాహసం..!
MHBD: జిల్లాలో జామండ్లపల్లి–మహబూబాద్ 33 కేవీ లైన్‌లో గుండ్లకుంట కాలనీ చెరువులో కరెంటు స్తంభం వద్ద లోపం తలెత్తింది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ సిబ్బంది పడవ సహాయంతో చెరువులోకి వెళ్లి మరమ్మతులు చేపట్టారు. లైన్‌మెన్ రమేష్, జేఎల్ఎం యాకన్న కృషితో విద్యుత్ సరఫరా పునరుద్ధరించగా, ఏడి ప్రశాంత్, ఏఈ వెంకటేశ్వర్లు, ఎల్‌ఐ రత్నం రాజు పాల్గొన్నారు.