ఆదివారం: నేటి తిరుమల సమాచారం
TPT: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. అదే విధంగా శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,040 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హూండీ ఆదాయం సుమారు రూ. 3.18కోట్ల ఆదాయం వచ్చింది. 31,606 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు.