విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VSP: పినమడక గ్రామంలో నిర్వహించిన శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులతో కలిసి పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధర్మం, నీతి, సేవ భావాల ప్రతీక అయిన శ్రీరాముని మార్గాన్ని ప్రజలు అనుసరించాలని పేర్కొన్నారు.