తెనాలిలో దొంగల టెన్షన్..!
GNTR: తెనాలిలో చోరీలు పరంపర కొనసాగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వేసవి వేడి పెరిగే కొద్దీ దొంగలు తాళం వేసిన ఇళ్లు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గంగానమ్మపేట జ్యువెలరీ షాపు కేసు ఇంకా ఛేదించకముందే, మారీసుపేటలో మరో చోరీ వెలుగులోకి వచ్చింది. చైన్ స్నాచింగ్ ఘటనలు పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.