ప్రైవేటు డీలర్లకు అదనంగా మరో 12 టన్నుల యూరియా

ASR: ప్రైవేటు డీలర్లకు అదనంగా మరో 12 టన్నుల యూరియాను పంపిణీ చేశామని చింతపల్లి మండల వ్యవసాయ అధికారి టీ.మధుసుదనరావు తెలిపారు. సోమవారం రాత్రి మండలానికి వచ్చిన యూరియాను మూడు దుకాణాలకు నాలుగు టన్నులు చొప్పున కేటాయించామన్నారు. ప్రైవేటు డీలర్లకు గతంలో 40టన్నులు, తాజాగా మరో 12 టన్నులు ఇచ్చామన్నారు. అలాగే రైతు సేవా కేంద్రాల్లోనూ యూరియాను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.