స్థానికులపై చిన్నచూపు లేదు: TTD ఈవో
TPT: వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగిందని, మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుండేదని తిరుపతికి చెందిన చంద్రశేఖర్ డయల్ యువర్ TTD ఈవోలో కోరారు. 'స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజులు దర్శనాలకు కేటాయించాం. స్థానికులపై చిన్న చూపు లేదు' అని ఈవో అనిల్ సింఘాల్ సమాధానమిచ్చారు.