భర్త మందలించాడని వివాహిత ఆత్మహత్య
అన్నమయ్య: రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లిలో భర్త తిట్టాడనే మనస్తాపంతో 26 ఏళ్ల వివాహిత ఆకుతోట సుధారాణి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి ఆమె మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుండగా భర్త వెంకటరమణ గమనించి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సుధారాణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.