CM పర్యటన.. BC నేతల ముందస్తు అరెస్టు
KNR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ పర్యటన సందర్భంగా బీసీ నేతలను శంకరపట్నంపోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీసీ ఆజాద్ ఫెడరేషన్వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్, మండలాధ్యక్షుడు బొంగోని అభిలాష్, నాయకులు నామని పరంధాములు తదితరులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ నేతలను అరెస్టు చేశారని తెలిపారు.