ఇంట్లోకి చొరబడి వ్యక్తిని నరికి చంపిన దుండగులు

ఇంట్లోకి చొరబడి వ్యక్తిని నరికి చంపిన దుండగులు

AP: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ధూళిపాళ్లలో తల్లి, కుమారుడిపై దుండగులు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి సాంబశివరావు(36)ను నరికి చంపారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన తల్లి కృష్ణకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసిన దుండగులు పారిపోతుండగా.. చాగల్లు వద్ద గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.