అందుబాటులో TGRJC సెట్ హల్ టికెట్స్

MBNR: గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి TGRJC సెట్-2025 పరీక్షను మే 10 వ తేదిన నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇంటర్ ప్రవేశాలకు అప్లై చేసిన వారు tgrjc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.