నేటి నుంచి కళాశాలలు బంద్

నేటి నుంచి కళాశాలలు బంద్

KMM: నేటి నుంచి జిల్లాలో కళాశాలలు మూగబోనున్నాయి. రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. జిల్లాలో ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలలతోపాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, ఫార్మసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో సుమారు 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.