సమాజంలో తల్లి పాత్ర కీలకమైంది: మంత్రి

MDK: మంత్రి దామోదర్ రాజనర్సింహ మదర్స్ డే సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో తల్లి పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. భావి పౌరులను తీర్చిదిద్దే అమ్మ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశ భవిష్యత్ బాగుంటుందని వెల్లడించారు. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.