ఒకే రోజు రెండు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు
VZM: మెరకముడిదాం గ్రామానికి చెందిన కొమ్ము సూర్యకళకు టెట్, రైల్వే పరీక్షలు ఒకేరోజు వేర్వేరు కేంద్రాల్లో రావడంతో ఇబ్బంది ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రాల మధ్య 15 కి.మీ దూరం ఉండగా, చేరుకోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండటం అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టం జరుగుతోందని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు.