సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

W.G: తణుకు నియోజకవర్గంలో సుమారు 26 మందికి శనివారం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. పేద ప్రజలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.36 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామన్నారు.