దళిత మహిళపై దాడి.. అట్రాసిటి కేసు పెట్టాలని డిమాండ్

దళిత మహిళపై దాడి.. అట్రాసిటి కేసు పెట్టాలని డిమాండ్

NLR: చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో దళిత మహిళ వసంతమ్మపై జరిగిన దాడిని సీపీఎం, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వసంతమ్మను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సాగుచేస్తున్న పంటను ధ్వంసం చేసి, భూమిని ఆక్రమించేందుకు యత్నించిన చలమల సుబ్బారెడ్డి, అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.