పొలంలో జారి పడి వ్యక్తి మృతి

పొలంలో జారి పడి వ్యక్తి మృతి

SRPT: వరి నాటేందుకు వెళ్లిన సమయంలో జరిగిన ప్రమాదంలో గోలి రామారావు అనే రైతు బుధవారం మృతి చెందారు. కాపుగల్లు శివారులోని కొండలు పొలంలో నారు వేస్తుండగా, గట్టుపై నుండి జారిపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి భార్య గోలి పుల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.