VIDEO: వేసవి సెగలు.. 38 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
SRPT: మోతే మండలంలో వేసవి సెగలు మొదలయ్యాయి. ఎండలు మండిపోతుండటంతో శనివారం గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. వేడి గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారులు సూచిస్తున్నారు.