VIDEO: అటవీ ప్రాంతంలో కనువిందు చేస్తున్న వాటర్ ఫాల్స్
NTR: కంచికచర్ల మండలం గొట్టిముక్కల శివారులోని అటవీ ప్రాంతంలో మద్దులమ్మ తల్లి ఆలయ సమీపంలోని జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రదేశం చూసిన వారెవరైనా మంత్రముగ్ధులవుతున్నారు. ఇక్కడి చల్లని వాతావరణం, జలపాతాల అందాలు పర్యాటకుల హృదయాలను దోచుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తున్నారు.