'ముదిరాజులు ఐక్యతతో హక్కులను సాధించుకోవాలి'
SRPT: ముదిరాజు కులస్తులంతా ఐక్యతతో హక్కులను సాధించుకోవాలని ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు బాషబోయిన భాస్కర్ అన్నారు. ఇవాళ పట్టణంలోని రామిరెడ్డిపాలెం వద్ద మామిడి తోటలో ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.