రైతులకై రోడ్డెక్కిన బీజేపీ

HYD: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ORR చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలకు, మండలాలకు రైతు భరోసా ఇవ్వనందుకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో కొద్ది సేపు ఆ ప్రాంతం హోరెత్తింది. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.