తాడేపల్లిలో ఇంటిపైకి దూసుకెళ్లిన కారు
GNTR: తాడేపల్లి పరిధిలోని ఆర్.ఎం.ఎస్. కాలనీలో శనివారం రాత్రి ఒక కారు ఇంటిపైకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.