ఇకపై తెలుగులోనూ రాజ్యాంగం
ఇప్పటి వరకు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న భారత రాజ్యాంగం ఇకపై పలు భాషల్లోనూ చదవొచ్చు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము 9 భాషలతో కూడిన డిజిటల్ కాపీలను విడుదల చేశారు. దీంతో తెలుగు, మరాఠీ, నేపాలీ, పంజాబీ, జోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ, మలయళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో అతి పెద్దదైన భారత రాజ్యాంగంలో 26 భాగాలు, 12 షెడ్యూళ్లు, 448 అధికరణాలు ఉన్నాయి.