VIDEO: వేధింపులు తాళలేక ఏడు నెలల గర్భిణీ ఆత్మహత్య.!
KNR: ఏడు నెలల గర్భిణీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఇల్లందకుంట (M) శ్రీరాములపల్లిలో జరిగింది. భూపాలపల్లి జిల్లా బుద్దారంకి చెందిన ప్రశాంత్‌తో మౌనికకు వివాహాం జరిగింది. కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం ప్రశాంత్, మౌనికను టార్చర్ చేస్తున్నాడని.. అది తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.