VIDEO: పాఠశాల గేటు ముందు విద్యార్థుల ధర్నా
RR: కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. తమకు 4 నెలలుగా ఫిజిక్స్ టీచర్ లేదని పాఠశాల గేటు ముందు భైఠాయించి ధర్నా చేపట్టారు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని, టీచర్ లేకుండా ఎలా చదువుకోవాలని పలువురు విద్యార్థులు ఆరోపించారు. డీఈవో వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని పేర్కొన్నారు.