'సివిల్ రైట్స్ డే నిర్వహించాలి'
W.G: భీమవరం ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో ఆదివారం కేవీపీఎస్ జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు మాట్లాడారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం జీవో ఎం.ఎస్.నెం. 105ను అనుసరించి ప్రతి నెలా చివరి రోజున 'సివిల్ రైట్స్ డే' నిర్వహించాలన్నారు.