VIDEO: వీరులపాడులో మొద్దు వడ్లకు పెరిగిన డిమాండ్
NTR: వీరులపాడు(మం) జయంతిలో మొద్దు వడ్లకు దిగుబడి భారీగా వచ్చిందని రైతులు తెలిపారు. ధర సైతం ఆశాజనకంగా ఉందని రైతులు అన్నారు. క్వింటాకు రూ. 2,369 వరకు ధర పలుకుతుందని తెలిపారు. అయితే ఈ ధాన్యాన్ని మధ్యవర్తులకు అమ్ముతున్నట్లు రైతులు చెప్పారు. వ్యవసాయ పరపతి సంఘాల్లో మొద్దు వడ్లను సైతం కొనుగోలు చేస్తున్నామని రైతులు గమనించాలని అధికారులు కోరారు.