అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
PLD: చిలకలూరిపేట పట్టణ పోలీసులు ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను DSP హనుమంతురావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 370/2025 కింద కేసు నమోదైన భైరా సుజాత ఇంటి దొంగతనంలో ఈ ముఠా నిందితులుగా ఉన్నారు.