రేపు విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో PGRS
విశాఖపట్నం నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం 'పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి పోలీస్ కమిషనరేట్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా కమిషనర్‌కు వినిపించవచ్చని చెప్పారు. బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యమన్నారు.